Sunday, December 7, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కొవ్వూరు పట్టణ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్స్ హెల్త్ ఆశ సిబ్బంది ఏఎన్ఎంలు పట్టణ ప్రజలు ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముందుగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టి అనంతరంప్రభుత్వ ఆసుపత్రి నుండి స్థానిక విజయ విహరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎయిడ్స్ సంక్రమ మార్గాలు నివారణ చర్యలు ముందస్తు పరీక్షల ప్రాధాన్యం గురించి ప్రజలు అవగాన కలిగి ఉండాలన్నారు. ఈ ర్యాలీ లో కౌన్సిలర్ సత్యనారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ వాజా దుర్గ ప్రసాద్, హెడ్ నర్స్ సిహెచ్ భాగ్యవతి, ఫార్మసిస్ట్ మృదుల వాణి, సిబ్బంది మరియు నర్సులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు