Tuesday, February 4, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లామళ్లీ మండవకే చైర్మన్ పట్టం…

మళ్లీ మండవకే చైర్మన్ పట్టం…

విశాలాంధ్ర నందిగామ:-గత రెండు రోజులుగా ఎంతో ఉత్కంఠంగా ఎదుర్కొన్న నందిగామ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని నందిగామ శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య సూచనల మేరకు పార్టీ అధిష్టానం బీఫామ్ జారీ చేసినట్లుగా దాని ద్వారా నందిగామ పదో వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన మండవ కృష్ణ కుమారిని చైర్మన్ అభ్యర్థి గా ప్రకటించన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఉన్న తంగిరాల సౌమ్య తో పాటు మొత్తం 15 మంది కూటమి కౌన్సిలర్స్ బలపరిచారు దాంతో నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికను ధ్రువీకరించి ఎన్నికల అధికారిగా ఉన్న నందిగామ ఆర్డీవో కే బాలకృష్ణ ఆమెకు డిక్లరేషన్ పత్రాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో అందజేశారు అంతకుముందు జరిగిన ఓటింగ్ లో ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఉన్న తంగిరాల సౌమ్యతో కలిసి మొత్తం 15 మంది కౌన్సిలర్లు మండవ కృష్ణకుమారికి మద్దతు పలికారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు కౌన్సిలర్లు ఉండగా ఓర్సు శ్రీలక్ష్మి నీ వైసిపి కౌన్సిలర్లు ముగ్గురు బలపరిచారు ఓర్సు శ్రీలక్ష్మి తటస్థంగా ఉన్నారని ఎన్నికల అధికారి ప్రకటించారు అధికారికంగా కూటమి సభ్యులు 15 మంది మద్దతు పలకడంతో మండవ కృష్ణ కుమారిని చైర్మన్ గా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ కొందరు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఈరోజు వారికి తెలిసిందా ఎవరు డమ్మినో ఎవరు డాన్ నో అని ఎద్దేవా చేశారు కొందరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొరకు కోటి రూపాయలు డబ్బులు డిమాండ్ చేసినట్లుగా అపవాదులు సృష్టించారని అటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదని హితవు పలికారు కౌన్సిలర్లు గత రెండు రోజులుగా వారితో ఉంటూ ఈరోజు పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె పేరుపేరునా అభినందనలు తెలియజేశారు నందిగామ నియోజకవర్గంలో ముఖ్యంగా నందిగామ పట్టణంలో గత ఆరు నెలలుగా మున్సిపల్ చైర్ పర్సన్ తమ పార్టీ అభ్యర్థి లేకపోయినా సుమారు నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను తలపెట్టినట్లు తెలియజేశారు గత వైయస్సార్ పాలనలో అభివృద్ధిని అభూత కల్పన చేసి ప్రజలను మభ్య పెట్టారని నందిగామను సర్వనాశనానికి దోహదం చేశారని అన్నారు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నందిగామ అభివృద్ధి పరుగులు పెడుతుందని దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరుపేరునా ధన్యవాదాలు అంటూ ముగించారు అంతకుముందు చైర్మన్ గా ఎన్నికైన మండవ కృష్ణకుమారికి స్వీట్ తినిపించి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు తో కలిసి సంబరాలు చేసుకున్నారు

నాడు మండవకే నేడు మండవకే… మున్సిపల్ చైర్మన్ పీఠం

నందిగామ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మండల వరలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు ఆ తరువాత అప్పటి ఎమ్మెల్యే వారి సోదరులు మండవ వరలక్ష్మికి చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టారు తరువాత జరిగిన పరిణామాల వల్ల ఆమె అనారోగ్యంతో మృత్యువాత చెందారు తరువాత వారి భర్త అక్కడ జరిగిన పరిణామాలను సహించలేని పరిస్థితుల్లో పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దశ నుండి మండవ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మండవ శ్రీనివాసరావు పార్టీ ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు నాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని అప్పటి ఎంపీ నందిగామ సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన సందర్భంలో వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిత కేసులు నమోదు చేసి వారికి రిమాండ్ విధించారు ఆ కేసులో మండవ శ్రీనివాసరావు జైలు శిక్ష అనుభవించారు ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మండవ శ్రీనివాసరావు సతీమణి కృష్ణకుమారి ని పదో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది అత్యధిక మెజార్టీతో వార్డు సభ్యులు ఆమెకు కౌన్సిలర్ పట్టం కట్టారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మండవ ఎటువంటి పదవులు ఆశించకుండా తెలుగుదేశం పార్టీలో ఎప్పటిలాగానే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు కానీ నేడు ఆ కృషికి ఫలితం దక్కిందని నందిగామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంటున్నారు ఏది ఏమైనా నందిగామ చైర్మన్ పీఠంపై మరోసారి మండవ కుటుంబీకులు కూర్చోవడంతో నాడు మండవ కే నేడు మండవ కే అంటూ చలోక్తులు ప్రజలు నుండి వస్తున్నాయి చైర్మన్ గా ఎన్నికైన మండల కృష్ణకుమారి, శ్రీనివాసరావులను పుష్పగుచ్చాలు అందజేసి పలువురు అభినందించారు కార్యకర్తలు కోలాహారంగా బైక్ ర్యాలీ నిర్వహించారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు