Friday, March 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా మొల్ల జయంతి వేడుకలు

ఘనంగా మొల్ల జయంతి వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణములోని ఆర్ అండ్ బి బంగ్లాలో ఆతుకూరి మోల్ల జయంతి వేడుకలను కుమ్మర కులస్తుల అధ్యక్షులు రాఘవేంద్ర ప్రజాపతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ధర్మవరం నియోజకవర్గ ఎన్ డి ఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, కుమ్మర కుల బాంధవులు తదితరులు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరంలో కుల బాంధవుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, గొప్ప తెలుగు కవయిత్రి, సాధువు మోల్లమాంబాను గౌరవించడం జరుగుతోందని తెలిపారు. వారు కవయిత్రి గానే కాకుండా పురుషుల ఆధిపత్యములో ఉన్న కాలంలో అడ్డంకులను ఛేదించిన గొప్ప మహిళ గా కూడా ఒక మార్గదర్శకురాలు అని వారు కొనియాడారు. అంతేకాకుండా ఆమె ప్రజల భాష అయిన తెలుగులో రాయడానికి ఎంచుకొని అత్యంత ప్రసిద్ధి రచన మొల్ల రామాయణం, రాముడి కథను సరళంగా ఆధ్యాత్మిక పద్ధతిలో వివరించే ఒక కళాఖండము అని తెలిపారు. ఆమె రచనలు తరతరాలకు స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నాయని, భక్తి, జ్ఞానం, పట్టుదల, ఏ అడ్డంకి నైనా అధిగమించగలరని అవి మనకు బోధిస్తున్నాయని తెలిపారు. ఆమె చేసినట్లుగా విద్య, జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావడానికి మనమందరం కృషి చేయాలని వారు పులుపునిచ్చారు. మొల్ల కుమ్మరి కులంలో పుట్టడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మర కుల సంఘం ఉపాధ్యక్షులు మహేశ్ ప్రజాపతి, కార్యదర్శి రంగనాథ్, ప్రచార కార్యదర్శి రాప్తాడు దామోదర, కోశాధికారి కానీండ్ల రాజు, కుమ్మర కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు