Wednesday, July 2, 2025
Homeజిల్లాలువిజయనగరంఇంజనీరింగ్ సిబ్బంది సమ్మె వద్దకు మున్సిపల్ కమిషనర్

ఇంజనీరింగ్ సిబ్బంది సమ్మె వద్దకు మున్సిపల్ కమిషనర్

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా): రాజాం మున్సిపల్ కార్యాలయం వద్ద గత కొన్ని రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తున్న టెంట్ వద్దకు రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయుడు వెళ్లి వారితో మాట్లాడుతూ ప్రజల అవసరాల దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు కోరి మీ యొక్క సమ్మెను విరమించి విధుల లోనికి జాయిన్ అవ్వాలని సమ్మె చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఇంజనీరింగ్ సిబ్బంది మాట్లాడుతూ మా యూనియన్ నాయకులతో మాట్లాడి తెలియపరుస్తామని కమిషనర్ కు వారు తెలియజేశారు. కమిషనర్ తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రసాద్, మున్సిపల్ మేనేజర్, సర్వేర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు