Homeఅంతర్జాతీయంతొలి ట్రిలియనీరుగా మస్క్?

తొలి ట్రిలియనీరుగా మస్క్?

- Advertisement -


రికార్డు దిశగా ప్రపంచ కుబేరుడు


వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలా మస్క్ సరికొత్త రికార్డుకు చేరువవుతున్నారు. ప్రపంచం లోనే తొలి త్రిలియనీరుగా మారనున్నారు. ఈ ఏడాదిలోనే ఆ మార్కుకు చేరుకుంటారని అంచనాలు ఉన్నాయి. నెలాఖరు నాటికి ₹800 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి వ్యక్తిగా మస్క్ నిలిచారు. ప్రస్తుతం ఆయన సంపద 850 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన కుబేరుల జాబితాలో ఉన్న గూగుల్ సహా వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గిబ్రిన్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంపదలకంటే మార్క్ సంపద వేగంగా పెరగడం వెనక స్పేస్ ఎక్స్, ఎక్స్ ఏ ఐ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం కీలకంగా మారింది. కృత్రిమ మేధ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ఏఐ ని గతవారం 1.25 ట్రిలియన్ డాలర్లతో స్పేస్ ఎక్స్ కొనుగోలు చేసింది. విలీనం అయిన సంస్థల్లో ఆయన వాటా 43% గా ఉంది, ఆ వాటా విలువే 530 బిలియన్ డాలర్లు. ఇక మస్కకు టెస్లా వాటా విలువ 178 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాదిలో ఈ బిలియనీర్… త్రిలియనీర్గా మారే అవకాశం 75 శాతం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు