ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య తప్పక లభిస్తుంది
మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు హేమంత్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ పాఠశాల అభివృద్ధియే నా ధ్యేయమని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య తప్పక లభిస్తుందని మున్సిపల్ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయుడు, హెడ్ మాస్టర్ నిమ్మల హేమంత్ బాబు తెలిపారు. ప్రస్తుతం హేమంత్ బాబు తన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రయత్నం చేయడానికి ఒంటరి పోరాటాన్ని సల్ఫీ విజయపతంలో ముందంజలో ఉన్నారు. వివరాలకు వెళితే నిమ్మల హేమంత్ బాబు తల్లిదండ్రులువెంకటరమణ ,గంగులమ్మ. వీరికి ఒక కుమారుడు హేమంత్ బాబు, ఒక కుమార్తె వీణ కలరు. తండ్రి చేనేత కార్మికుడిగా పనిచేస్తూ తన ఇద్దరు బిడ్డలను కష్టపడి చదివించాడు. ఇద్దరూ కూడా డీఎస్సీ పరీక్షల్లో చక్కటి ప్రతిభను ఘనపరిచి అక్క వీణ మడకశిరలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. అదేవిధంగా తమ్ముడైన హేమంత్ బాబు ధర్మవరం పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల సెంట్రల్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సింగల్ టీచర్ గా, హెడ్మాస్టర్ గా 2025 నుంచి తన విధులను కొనసాగిస్తున్నాడు. హేమంత్ బాబు 2025 లో జిల్లాలో 25వ ర్యాంకుతో మొట్టమొదటిగా ధర్మవరం పట్టణమునకు ఉపాధ్యాయుడిగా సెంట్రల్ స్కూల్లో తన విధులను కొనసాగించాడు. ఆ తర్వాత ఈ సెంటర్ స్కూల్ యొక్క పూర్వ స్థితిలను తెలుసుకొని, ఎట్లైనా సరే ఈ పాఠశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కంకణం కట్టుకున్నాడు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ ,డీఈవో, ఎం ఈ ఓ ల ఆదేశాల మేరకు ఏప్రిల్ 24 నుంచి ఇప్పటివరకు తనదైన శైలిలో ఎవ్వరి సహకారం లేకుండా తన ఏరియాలో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను చేర్పించుకుందుకు ఎంతో కృషి చేశాడు. గత సంవత్సరంలో 11 మంది విద్యార్థులు ఉండగా, 2026-27 సంవత్సరమునకు 25 మందిని ప్రవేశాలు కల్పించాలన్న ఉద్దేశంతో తాను తిరుగుతున్నానని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థులను చేర్చగా మొత్తం 19 మంది విద్యార్థులు ఉన్నారని, పాఠశాల పునః ప్రారంభం అయ్యేసరికి 25 మంది విద్యార్థులు ఉండేటట్లు తనవంతుగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇందుకు ప్రస్తుత పాఠశాలలో ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రచార విషయములో ఎంతో సహకారాన్ని అందించడం పట్ల ఉపాధ్యాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పట్టు వదలని విక్రమార్కుడి లాగా అతి చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమని పలువురు తెలుపుతున్నారు. అంతేకాదు ఇతను చేస్తున్న ప్రయత్నం సోషల్ మీడియాలో రావడంతో, ప్రతి ఒక్కరూ ప్రోత్సహించే దిశలో వారు సహకారాన్ని అందిస్తున్నారు. సైకిల్లో తన ప్రచారాన్ని చేస్తూ సొంతంగా తన ఖర్చుతో కరపత్రాలను ముద్రించి ఇంటింటికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్న వాటికి పూర్తి నిమగ్నమై తనదైన శైలిలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీచర్స్ లర్నింగ్ మేటర్ (టీ ఎల్ ఎం) ద్వారా తన పాఠశాల చేస్తున్న వాటిని కూడా అందులో పోస్ట్ చేయడం వల్ల, అక్కడ కూడా మంచి గుర్తింపును హరీష్ బాబు పొందాడు. ఒకప్పుడు సెంట్రల్ స్కూల్ 2011 వ సంవత్సరంలో 250 మందితో ఐదవ తరగతి వరకు ఉండేదని, కానీ కొన్ని అనివార్య కారణాల వలన సంఖ్య పూర్తిగా తగ్గడంతో పట్టణంలో ఒకరకంగా మంచి గుర్తింపు రాలేకపోయిందని తెలిపారు. అయినా సరే తనదైన శైలిలో పాత పూర్వ వైభవాన్ని తెప్పించేంతవరకు నిద్ర పోను అని స్పష్టం చేశారు. కాయగూరల మార్కెట్ వద్ద గల ఈ సెంట్రల్ స్కూలుకు ఏరియాలో మరో మూడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయినా సరే పోటీ ఉన్నా కూడా నా ప్రయత్నం మానను అని స్పష్టం చేస్తూ జూన్ పాఠశాల ప్రారంభం నాటికి నా లక్ష్యాన్ని నెరవేరుస్తాను అని తెలిపారు. ఉపాధ్యాయునికి ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి ఎంతో ప్రోత్సహిస్తూ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని హరీష్ బాబు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మామూలుగా ఇటువంటి పాఠశాలల్లో అంటే అతి తక్కువ విద్యార్థులు ఉన్న చోట ఆ ఉపాధ్యాయుడే తిరిగి సంఖ్యను పెంచి అదే స్కూల్లో ఉపాధ్యాయుడుగా పని చేసే కంకణం కట్టుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇటువంటి ఉపాధ్యాయులకు సీనియర్ ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా నాకు మా అక్క వీణ స్ఫూర్తిదాయకమని, ఆమె ప్రోత్సాహము సహకారం ఉన్నందునే తాను కూడా ఉపాధ్యాయుడు అయ్యానని తెలిపారు. మా తల్లిదండ్రుల కష్టం తెలుసుకొని తాము ఈ ఉపాధ్యాయ వృత్తితో తమ తల్లిదండ్రులను పోషించే స్థాయికి తాము రావడం నిజంగా మా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతూ, ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కార్పొరేట్ స్కూల్ కంటే ప్రభుత్వ పాఠశాల లే మిన్న అని నిరూపించుకున్నాయని పలువురు విద్యావేత్తలు తెలిపారు. ఇటువంటి ఉపాధ్యాయులు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నప్పుడే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలకు మనుగడ ఉంది అని కూడా పలువురు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి నా ధ్యేయం
- Advertisement -
RELATED ARTICLES


