Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముగిసిన ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా కార్యక్రమం

ముగిసిన ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా కార్యక్రమం

- Advertisement -

ప్రధాన సమస్యలు డిమాండ్లు తీర్చేంతవరకు మా పోరాటాలు ఆగవు

ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కేబి నాగార్జున రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;! ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన సమస్యలు డిమాండ్లు తీర్చేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కే బి నాగార్జున రెడ్డి, డిపో కార్యదర్శి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా మే నెల 16, 17 రెండు రోజులపాటు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర కమిటీ 39 డిమాండ్లతో ఇచ్చిన మెమోరాండంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల సమ్మెకు వెళ్లడానికి తమ సిద్ధమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా రవాణా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టపెట్టే ఆలోచనను విరమించుకోవాలని, విద్యుత్ బస్సు ఆపరేటర్ల కోసం డిపోలను ఖాళీ చేయించే విధానం మానుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలని తెలిపారు. టీం డామేజ్ ల పేరుతో విధిస్తున్న రికవరీలను వెంటనే నిలిపివేయాలని తెలిపారు. మాకు రావలసిన పెండింగ్ డిఏ బకాయిలు, పి ఆర్ సి బకాయిలు విడుదల చేస్తూ, ఐ ఆర్ ప్రకటించి పి ఆర్ సి కమిషనర్ను నియమించాలని వారు తెలిపారు. శ్రీ శక్తి పథకం ఆములతో ఏర్పడిన ఇబ్బందులను వెంటనే తొలగించాలని, నూతన బస్సులు కొనుగోలు చేపట్టాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించేలా చర్యలు వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు వారికి అప్పగించే రాదని ఆర్టీసీ ద్వారానే స్వయంగా నడిపేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రత భరోసా ఆర్టీసీ తోనే సాధ్యము అని వారు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులే ముద్దు-ప్రైవేట్ విద్యుత్ బస్సులు వద్దు అన్న నినాదం మారుమోగించారు. ఈ ఉద్యమం ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకునే ఉద్యమమే తప్ప ప్రభుత్వం వ్యతిరేక ఉద్యమం కాదు అని తెలిపారు. పెండింగ్ లో ఉన్న నైట్ హార్ట్ అరియర్స్ ఇవ్వాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని తెలిపారు. కాలం చెల్లిన బస్సుల బ్రేక్డౌన్ కు గ్యారేజ్ ఉద్యోగులను బాధ్యులను చేస్తూ ఇచ్చే పనిష్మెంట్ల విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు తిరుమలేష్, గ్యారేజీ కార్యదర్శి మల్లికార్జున, ఇష్టం సూపర్వైజర్ సుధాకర్, రీజినల్ జాయింట్ సెక్రెటరీ నరసింహులు, రీజనల్ ప్రచార కార్యదర్శి బుల్లె ఆదినారాయణ, నాయకులు సివిఆర్ రెడ్డి, నజీర్ సాహెబ్, జీకే రెడ్డి, ఎస్ ఎస్ వలి, ఏ నాయక్, నారాయణ ,మునయ్య, ఆంజనేయులు, బాబు, రామకృష్ణ, చలపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు