Friday, May 9, 2025
Homeఆంధ్రప్రదేశ్సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింప చేయడమే నా లక్ష్యం..

సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింప చేయడమే నా లక్ష్యం..

పోలవరపు లక్ష్మీ చౌదరి
విశాలాంధ్ర ధర్మవరం : హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింప చేయడమే నా లక్ష్యము అని పోలవరపు లక్ష్మీ చౌదరి తెలిపారు. పోలవరపు లక్ష్మీ చౌదరి ఆరవ తరగతి చదువుతూ, తన చిన్ననాటి నుండే అనగా నాలుగు సంవత్సరాల వయసు నుండే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, భరతనాట్యం, కూచిపూడి, పాటలు, దేవుని పాటలు, రామాయణం, భారతం లోని పద్యాలను అవలీలగా తెలుపుతుంది. లక్ష్మీ చౌదరి యొక్క ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అనంతశయన, కీర్తి చౌదరిలకు రెండవ సంతానం. అప్పటినుంచి లక్ష్మీ చౌదరికి చదువుతోపాటు తనకు ఇష్టం ఉన్న నాట్యములు పాటలు గేయాలు పద్యాలను ప్రోత్సహిస్తూ ఎన్నోచోట్ల 20కి పైగా అవార్డులను పొందడం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు. ఆన్లైన్లోనూ, వివిధ ప్రదర్శనలను అనంతపురం, హైదరాబాద్, కడప, చిత్తూర్ తదితర ప్రాంతాలలో ధర్మవరం పేరును కీర్తి చాటింది. ఇటీవల జరిగిన ఘంటసాల వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కళాజ్యోతిలో తన గంటసాల పాటలను తన రాగంతో ప్రేక్షకులను మైమరిపించింది. అతి చిన్న వయసులో ఇటువంటి చేయడం తల్లిదండ్రుల అదృష్టం అని తెలుపుతూ కళాజ్యోతి కమిటీ వారు చిన్నారి లక్ష్మీ చౌదరిని శాలువాతో మెమొంటోళ్ళతో ఘనంగా సత్కరించారు. నాకు ఇటువంటి నాట్య ప్రదర్శన, గానం చేయుట లాంటివి అవకాశమిచ్చిన కళాజ్యోతి కమిటీ వరకు చిన్నారి తోపాటు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు