విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నౌలేకల్ లోని ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు బుధవారం నేషనల్ అచీవ్ మెంట్ సర్వే పరీక్ష నిర్వహించడం జరిగిందని మండల విద్యాధికారి 2 రామ్మూర్తి తెలిపారు. పెద్దకడబూరు ప్రాథమిక పాఠశాల నందు 3వ తరగతిలో 26 మంది విద్యార్థులకు, నౌలేకల్ ప్రాథమికోన్నత పాఠశాల నందు 3వ తరగతిలో 24 మంది విద్యార్థులకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో 30 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పరీక్షను విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి మరియు అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి, గుణాత్మక విద్యను అందించడానికి ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.