Homeజిల్లాలుఅనంతపురంవైద్య కళాశాలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

వైద్య కళాశాలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర- అనంతపురం : రేడియేషన్ ఆంకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీని నిర్వహించారు. వైద్య కళాశాల ఇంచార్జ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ శంకర్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ బెనడెక్ట జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని మెడికల్ కాలేజ్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మద్యపానం, ధూమపానం అలవాట్లను మాని వేయడం వలన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చని తెలిపారు. ఓ.పి నం.222 లో క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వాటినివినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఓ.పి నం : 6 లో పాప్ స్మియర్ పరీక్ష ద్వారా గర్భాశయ క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించి వైద్యులను సంప్రదించడం వలన చికిత్స సులభతరం అవుతుందని అన్నారు. వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజీలో వందేమాతరం గీతాన్ని వైద్యులు, వైద్య విద్యార్థులు ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ సరళ, సుచిత్ర, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఆది నటేష్, మాధవి లత, బేబీ సాయిరాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ సుష్మ, శ్రీనివాసరావు, నాగ ప్రవీణ్, గీతాంజలి, కుష్బూ, ఫర్హాన, నీరజ మరియు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ లలిత భవాని, సుమన గోపీచంద్, ఆదిరెడ్డి పరదేశి నాయుడు పాల్గొన్నారు. వైద్య విద్యార్థులు మరియు నర్సింగ్ విద్యార్థులు ర్యాలీని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు