Tuesday, April 22, 2025
Homeఆంధ్రప్రదేశ్నవదుర్గ అమ్మవారి హుండీ ఆదాయం రూ.1.31,457

నవదుర్గ అమ్మవారి హుండీ ఆదాయం రూ.1.31,457

విశాలాంధ్ర-విజయనగరం జిల్లా.రాజాం : రాజాం పాత బస్టాండ్ ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ నవదుర్గ అమ్మవారి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఈవో పొన్నాడ శ్యామలరావు ఆధ్వర్యంలో జరిగిన హుండీల లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఈ.వో బీ.వి.మాధవరావు హాజరయ్యారు.85 రోజులకు హుండీ ఆదాయం రూ.1,31,457 ₹ రూపాయలు వచ్చిందని ఈవో వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త వానపల్లి నరసింహారావు, అర్చకులు రామాయణ శ్రీనివాస శర్మ, రంప రామచంద్ర శర్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు