వాహన చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి… ఆర్టిఏ పూర్ణిమ
విశాలాంధ్ర నందిగామ:-హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై నందిగామ పోలీసులు కొరడా జులుపించారు మంగళవారం ఉదయం నేషనల్ హైవే 65 పై ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న మోటర్ వాహనాల వారిని నిరోధించి హెల్మెట్ వాడకం గురించి వారు ప్రకార్డుల ద్వారా వివరించారు ఈ సందర్భంగా స్థానిక మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ పూర్ణిమ తో కలిసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వైవిఎల్ నాయుడు వాహనదారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహదారులు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని అన్నారు,మోటారు వాహన చట్ట నిబంధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలన్నారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ లేకుండా రోడ్డుపై వాహనం నడిపితే భారీ జరిమానా విధిస్తామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ నరేష్,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్,ఏఎస్ఐ శ్రీనివాసరావు,ట్రాఫిక్ సిబ్బంది,మహిళా పోలీసులు పాల్గొన్నారు