Homeతెలంగాణఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక జోక్యం కుదరదు: హైకోర్టు స్పష్టీకరణ

ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక జోక్యం కుదరదు: హైకోర్టు స్పష్టీకరణ

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గుర్తు కేటాయింపు వివాదంలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. టీజీఆర్‌టీసీ యూనియన్ ఎన్నికల్లో గతంలో తమకు ఉన్న ‘విల్లు-బాణం్ణ గుర్తుకు బదులుగా ‘నిచ్చెన్ణ గుర్తును కేటాయించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పి. శ్రీదేవి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున, ఈ దశలో గుర్తుల కేటాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు