Homeతెలంగాణగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై దుమారం.. కాంగ్రెస్‌ను నిలదీసిన కవిత

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై దుమారం.. కాంగ్రెస్‌ను నిలదీసిన కవిత

- Advertisement -

తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించడం పూర్తి సామాజిక అన్యాయమని ఆమె ఆరోపించారు.మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డిని, నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఇద్దరు అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా కవిత స్పందించారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు… రెండు చోట్లా రెడ్డి నేతలకే టికెట్లు… ఇది పూర్తి సామాజిక అన్యాయం కాదా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుందని, కేవలం ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు