Homeఆంధ్రప్రదేశ్లబ్ధిదారుల పెన్షన్ తొలగింపు పై ఆందోళన వద్దు…

లబ్ధిదారుల పెన్షన్ తొలగింపు పై ఆందోళన వద్దు…

- Advertisement -

నియోజవర్గంలో అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం ….ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

విశాలాంధ్ర పుట్టపర్తి :- అర్హత కలిగిన ఏ లబ్ధిదారునికి పెన్షన్ ఆగిపోదని ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూటమిప్రభుత్వం పెన్షన్ అందజేస్తుందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారుల రీ వెరిఫికేషన్ లో కొంతమంది లబ్ధిదారుల పింఛన్ రద్దు అయినట్లు ఆందోళన చెందుతున్న విషయాన్ని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆమె అన్నారు. సదరం మెడికల్ క్యాంపు రీ వెరిఫికేషన్ లో నియోజకవర్గంలో సుమారు 1210 పెన్షన్లు రద్దు అయినట్లు అధికారులు ప్రకటించారని, నియోజకవర్గంలో అర్హుల పెన్షన్లు రద్దు అయినట్లు ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదని అధికారులకు ఎమ్మెల్యే పల్లె సింధూర ఆదేశించారు.వైసీపీ ప్రభుత్వ హయంలో ఎక్కువ మంది ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో చాలా మంది ఎక్కువ పెన్షన్లు పొందుతున్నారని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం పై ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధికారులతో పెన్షన్ల పై ఈ రీ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ వెరిఫికేషన్ లో అధికారుల కొన్ని లోపాల వల్ల అర్హులకు కొంత అన్యాయం జరిగివుండవచ్చునని విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వెంటనే విచారణ చేసి అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు. రద్దు అయిన పెన్షన్ల లబ్ధిదారులకు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నోటీసులు కూడా వెనక్కు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇందులో దివ్యాంగులు మరియు ఇతరుల పెన్షన్ సాంకేతిక కారణాల వల్ల అధికారులు తొలగించి ఉంటే తప్పకుండా ఆ పెన్షన్లు మంజూరు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. అర్హులైన వారి పెన్షన్ ను అధికారులు రీ వెరిఫికేషన్ లో తొలగించి ఉంటే అలాంటి గ్రామీణ ప్రాంతంలోని లబ్ధిదారులు వెంటనే స్థానిక ఎంపీడీవో వద్దకు వెళ్లి తిరిగి అప్లై చేసుకోవచ్చుననీ అని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన వారు మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అధికారుల రీ వెరిఫికేషన్ లో పెన్షన్ల తొలగింపు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,మంత్రి నారా లోకేష్ స్పందించి అర్హులకు అన్యాయం జరగకుండా వచ్చే నెలలో పెన్షన్ మంజూరు అయ్యేలా చూస్తామని సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అర్హులైన లబ్ధిదారులకు తప్పకుండా పెన్షన్లు మంజూరు చేస్తామని ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బాధిత పెన్షన్ లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు