విశాలాంధ్ర ధర్మవరం:: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ లలితా నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ, రామ లలిత్యా వారి శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి, జానపద నాట్యములు సంక్రాంతి, ప్రత్యేక నాట్యం అలరించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం మంత్రి చేతులు మీదుగా జ్ఞాపికలను అందుకున్నారు. మొత్తం మీద ఈనాట్య ప్రదర్శన పట్ల ప్రజలు, అధికారులు, బిజెపి నాయకులు, ఎన్డీఏ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఆకట్టుకున్న నాట్య ప్రదర్శనలు
RELATED ARTICLES