Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం వేడుకలు. ప్రిన్సిపాల్ సుందరేశ్వరరావు

ఘనంగా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం వేడుకలు. ప్రిన్సిపాల్ సుందరేశ్వరరావు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యన్ .ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏ. ఆదినారాయణ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా.కె.సుందరేశ్వర్ రావు అధ్యక్షతన ఘనంగా యన్.ఎస్.ఎస్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సుందరేశ్వర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు యన్.ఎస్.ఎస్ వాలంటీర్ గా ఉండడం గొప్ప భాగ్యం అని, సేవా అనేటువంటిది ఎంతో పవిత్రమైనదని, సొంత లాభం కొంతమానుకో – పొరుగు వారికి తోడ్పవోయ్.. సేవా దృక్పథాన్ని వెలిబుచ్చినటువంటి అనేక మందిని ఎంతో మంది ఉదాహరణగా చెబుతూ విద్యార్థులకు వివరించారు. గత సంవత్సరం యన్.ఐ.సి క్యాంపు చేసినటువంటి విద్యార్థులను ప్రశంసించారు. విద్యార్థుల అందరి బాధ్యత గా ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలని, అది మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుందని తెలిపారు.ప్రతి ఒక్కరు బాధ్యతగా వుండాలని తెలిపారు.అనంతరం యన్.యస్. యస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆదినారాయణ, హరి ప్రసాద్, ఆనంద్, సౌజన్య లక్ష్మి, ఒబులపతి,తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు