Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉత్పత్తుల భద్రత , ప్రమాదకరమైన ఉత్పత్తులపై ప్రతి వినియోగదారుడు అవగాహన తప్పక కలిగి ఉండాలి..

ఉత్పత్తుల భద్రత , ప్రమాదకరమైన ఉత్పత్తులపై ప్రతి వినియోగదారుడు అవగాహన తప్పక కలిగి ఉండాలి..

- Advertisement -

వినియోగదారుల సంఘం అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; ఉత్పత్తుల భద్రత, ప్రమాదకరమైన ఉత్పత్తులపై ప్రతి వినియోగదారుడు అవగాహన తప్పక కలిగి ఉండాలని వినియోగదారుల సంఘం అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం మండలం రావులచెరువు గ్రామ పంచాయితీ లో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఎన్. మహేశ్వర్, హెడ్మాస్టర్ అధ్యక్షతన వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం చిన్న తంబి చిన్నప్ప మాట్లాడుతూ ఉత్పత్తుల భద్రత అంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం, ప్రాణము, ఆస్తి వీటికి ఎటువంటి హాని జరగకుండా సురక్షితమైన ఉత్పత్తులను ఎంచుకోవాలి అని తెలిపారు. కొన్ని ఉత్పత్తులు తప్పుగా ఉపయోగించినప్పుడు విషపూరితము, మంట, ప్రేలుడు, విద్యుత్ షాక్ మొదలగునవి జరిగి గాయములు లేదా ప్రాణహాని జరగవచ్చునని తెలిపారు. కావున వినియోగదారులు ప్రతి ఒక్కరు భద్రత లేని ఉత్పత్తులను ప్రమాదకరమైన ఉత్పత్తుల విషయములో జాగ్రత్త వహించవలసినదిగా పాఠశాలలోని బాల బాలికలకు ఉద్దేశించి తెలపడం జరిగిందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నెలవారి క్యాలెండర్ ను అనుసరించి విద్యార్థులకు నో బ్యాక్ డే సందర్భముగా అందులోని విషయములు అవగాహన కల్పించు నిమిత్తమై కార్యక్రమం ఏర్పాటు చేయబడినది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సి ఏ పి సి ఓ సభ్యులు నారాయణమ్మ ,గౌరవ అధ్యక్షులు కుళ్లాయప్ప, ఉపాధ్యక్షులు యజన్న, సెల్వరాజ్, కార్యదర్శి గుర్రం వేణుగోపాల్, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ పల్లెం జనార్ధన్, పాఠశాల ఉపాధ్యాయు లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు