Homeజిల్లాలుతూర్పు గోదావరిపొలంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి

పొలంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి

- Advertisement -

కడియం మండల వ్యవసాయ అధికారి పివి శ్రీనివాస్

విశాలాంధ్ర – కడియం : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడియం మండలం లోని శివారు భూములలో 227 ఎకరాలు నీటిలో ఉందని, వెంటనే నీరు బయటకు వెళ్లేలా రైతులు చర్యలు తీసుకోవాలని కడియం మండల వ్యవసాయ అధికారి పివి శ్రీనివాస్ అన్నారు. కడియం మండలంలోని పలు గ్రామాలలో గల పంటలను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరి పంట చిరుపొట్ట దశలో ఉండగా వర్షాలు పడడం వలన పోషకాలు కొట్టుకుపోవడం, తెగుళ్లు పెరగడం వంటి సమస్యలు రావచ్చని, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పంటను రక్షించుకోవచ్చని తెలిపారు. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పంటను వాలిపోకుండా పరిశీలించాలని, తెగుళ్లను గమనించాలని కోరారు. అధిక తేమతో అగ్గి తెగులు, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ వంటి తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆకులపై మచ్చలు, కాలినట్లు కనిపించడం, ఆకు ఎండిపోవడం వంటి లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలని, కాండం తొలిచే పురుగు, ఆకు చుట్టు పురుగు వంటివి సోకకుండా పంటను క్రమం తప్పకుండా పరిశీలించాలని కోరారు. ఎరువులు లేదా పురుగు మందులను పరిస్థితిని బట్టి, వ్యవసాయ శాఖ సూచనల మేరకే ఉపయోగించాలని మండల వ్యవసాయ అధికారి పివి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు