Homeజిల్లాలుతూర్పు గోదావరిపొలాల్లో భారీగా నిలిచిన వర్షం నీరు

పొలాల్లో భారీగా నిలిచిన వర్షం నీరు

- Advertisement -

స్పందించిన అధికారులు

విశాలాంధ్ర – కడియం : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడియం మండలం, మాధవ రాయుడుపాలెం పరిధిలోని, చైతన్య నగర్‌లో పొలాల్లో భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. రైతులు ఇబ్బందులను తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. మండల వ్యవసాయ అధికారి పివి శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ కేశవ, గ్రామ వ్యవసాయ సహాయకులు భాగ్యశ్రీ తదితరులు తమ సిబ్బందితో కలిసి నీరు వెళ్లే మార్గాన్ని పరిశీలించి, శుభ్రం చేయించి, పొలాల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. దీనితో వరి పొలాల్లో నిలిచిన నీరు క్రమంగా బయటకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. రైతుల సమస్యను గుర్తించి తక్షణమే స్పందించిన అధికారులకు గ్రామస్థులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు