Thursday, May 29, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాఘనంగా ఎన్టీఆర్ 102 వ జయంతి వేడుకలు…

ఘనంగా ఎన్టీఆర్ 102 వ జయంతి వేడుకలు…

విశాలాంధ్ర- నందిగామ:-స్వర్గీయ నందమూరి తారకరామారావు లాంటి మహోన్నత మైన వ్యక్తిని చరిత్రలో మరొకరిని చూడలేమని కంచల మేజర్ డిసి చైర్మన్ రాటకొండ చంద్రశేఖరరావు అన్నారు బుధవారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో,స్థానిక గాంధీ సెంటర్లో,19వ వార్డు హనుమంతుపాలెం నందు ఘనంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేసిన డిసి చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్ ముందుగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహాలకు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం స్వీట్స్ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు ఒక ఆంధ్ర ప్రదేశ్ కే కాకుండా భారతదేశానికే సుపరిచితుడులా నిలిచారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు చేసిన అనతి కాలంలోనే దీర్ఘకాలికంగా బడుగు బలహీన వర్గాల మేలుకు ఆయన చేసిన కృషి ఎనలేని తెలియ పరిచారు అదే దారిలో నడుస్తూ తెలుగుదేశం పార్టీని దిన దిన అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఎన్డిఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో ప్రత్యేక భూమిక పోషిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మండవ పిచ్చయ్య,రాటకొండ కోటేశ్వరరావు,వడ్డెల్లి సాంబశివరావు,పంగా సతీష్, మన్నెం శ్రీనివాసరావు,గోపు పూర్ణచంద్రరావు,రబ్బాని, గాడిపర్తి రామకోటేశ్వరరావు, గాడిపర్తి భీమయ్య,ఘంట వీరభద్రరావు,వేజెండ్ల నరసింహారావు,గంట సాంబశివరావు,మంద జాన్ పీటర్,వేల్పుల వెంకట్రావు పెద్ద ఎత్తున గ్రామస్తులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు….

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు