Wednesday, February 18, 2026
Homeజిల్లాలునెల్లూరుగూడూరులో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

గూడూరులో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

- Advertisement -

టిడిపి మండల కన్వీనర్ జె సురేష్

విశాలాంధ్ర-గూడూరు: గూడూరు పట్టణంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 30 వ వర్ధంతి వేడుకలను టిడిపి నేతలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మండలంలోని బూడిదపాడు గ్రామంలో మండల టిడిపి కన్వీనర్ జే సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జె సురేష్ మాట్లాడుతూ తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు తెలుగు జాతి ఉన్నంతవరకు గుర్తుంటాయని తెలియజేశారు. కే డి సి సి చైర్మన్ డివిషవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ టిడిపిని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బంగారు శ్రీనివాసులు, రాముడు, వెంకటేష్,రామాంజనేయులు, బుగ్గన,ఈరన్న, సంజీవరెడ్డి, భాస్కర్, ఏసన్న పార్టీ నేతలు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు