Monday, February 3, 2025
Homeజిల్లాలుకర్నూలురైతుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలం

రైతుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ ఆరోపించారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దకడబూరు గ్రామానికి చెందిన మబ్బు ఈశ్వరమ్మ చెందిన సర్వే నెంబర్ 393, 395లలో 2.40 ఎకరాల భూమి క్రయముకాని విస్తీర్ణం అని పడిందని తెలిపారు. ఇది తాతల ఆస్తి అని వంశస్థులకు చెందుతున్నారు. భూమి సర్వే చేయాలని చలానా కట్టినారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యాలయం చుట్టూ తిరిగుతున్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై పలుమార్లు విఆర్ఓ, సర్వేయర్లు అల్లప్ప, లలిత దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమన్నారు. తక్షణమే సర్వేయర్ల చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కల్లుకుంట వీరేష్, బజ్జప్ప, నర్సోజి, యంకన్న, మొట్రు ఈరన్న, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు