Wednesday, February 18, 2026
Homeజిల్లాలుపశ్చిమ గోదావరిఉద్యానవన పంటలలో సాంకేతికతను అందిపుచ్చుకుని లాభాలను గడించాలి

ఉద్యానవన పంటలలో సాంకేతికతను అందిపుచ్చుకుని లాభాలను గడించాలి

- Advertisement -

-జిల్లాలో అభ్యుదయ రైతులు హైడ్రోపోనిక్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలి

-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

విశాలాంధ్ర తణుకు:తణుకు మండలం యర్రాయి చెరువు ప్రాంతంలో యువ రైతు రెండు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు పండించేందుకు రూ.1.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన హైడ్రోపోనిక్ యూనిట్ ను గురువారం జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి సందర్శించి రైతు ఏర్పాటు చేసిన యూనిట్, సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్శనలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఉద్యానవన పంటల సాగుకు మన జిల్లాలో యువరైతు చిట్టూరి వెంకట్ హైడ్రోపోనిక్ యూనిట్ ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. ఈ యూనిట్ లో ప్రస్తుతం ఒక ఎకరాలో ఇంగ్లీష్ కుకుంబర్, ఒక ఎకరంలో క్యాప్సికం సాగు చేస్తున్నారని, తక్కువ సమయంలో అధిక దిగుబడితోపాటు, నీటి ఆదా, పురుగు మందులు వాడకుండా అధిక లాభాలను పొందవచ్చు అన్నారు. ఈ పంటలకు కాస్మోపాలిటన్ పట్టణాల్లో మంచి గిరాకీ ఉందని తెలిపారు. మట్టిని వినియోగించకుండా న్యూట్రియెంట్ మీడియం కోకో పిట్ వినియోగించి సాగు చేయడం ఈ హైడ్రోపోనిక్ యూనిట్ యొక్క ప్రత్యేకత అన్నారు. జిల్లాలో ఉద్యానవన పంటల రైతులను ప్రోత్సహించేందుకు తణుకులో ఏర్పాటుచేసిన హైడ్రోపోనిక్ యూనిట్ ను ఉద్యానవన రైతులను తీసుకువెళ్లి చూపించాలని జిల్లా ఉద్యానవన అధికారికి సూచించారు. తద్వారా హైడ్రోపోనిక్ యూనిట్లు ఏర్పాటకు రైతులకు అవగాహనతో పాటు, ఏర్పాటుకు ముందుకు వస్తారని అన్నారు. వరదలు, తుఫాన్లు కారణంగా ఉద్యానవన రైతులు పంటలు నష్టపోకుండా ఈ విధానంలో సాగు ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎం.హరి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, హార్టికల్చర్ అధికారి ప్రియదర్శని, విహెచ్ఎ సోనియా, రైతు చిట్టూరి వెంకట్, కనకదుర్గ సునంద, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు