Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఅనంతపురంరబీలో సాగు చేసిన పంటలకు ఈ-క్రాప్ చేసుకోండి

రబీలో సాగు చేసిన పంటలకు ఈ-క్రాప్ చేసుకోండి

- Advertisement -


-ఏడీఏ అల్తాఫ్ ఖాన్

విశాలాంధ్ర-రాప్తాడు; రబీలో రైతులు సాగు చేసిన వివిధ పంటలకు ఈ-క్రాప్ చేసుకోవడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాలను లబ్ది పొందవచ్చని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
అల్తాఫ్ ఖాన్ సూచించారు. మండలంలోని ఎం.బండమీద పల్లి గ్రామ పంట పొలాలను గురువారం ఆయన రైతులతో కలిసి సందర్శించి సలహాలు, సూచనలను ఇచ్చారు. మండలంలోని ప్రతి రైతు కూడా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదును సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో చేసుకోవాలన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ఏపీఏఐఎంఎస్ 2.0 అనే యాప్ ను తయారు చేసిందని ఇందులో వ్యవసాయానికి సంబంధించిన సమాచారం ఉంటుందని, రైతులు ఈ యాప్ ను వాడాలని సూచించారు. అనంతరం వేరుశనగ పంటను పరిశీలించి వేరుకుళ్ళు తెగులు సోకిందని, నివారణకు ఎం-45 ఒక లీటరు నీటికి 3 కలిపి డ్రెంచింగ్ చేసుకోవాలన్నారు. రసం పీల్చు పురుగుల నివారణకు ఒక లీటరు నీటికి రెండు ఎం.ఎల్ ఇమిడా క్లోరోప్రిడ్ కాన్ఫీడార్ కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఎస్.కృష్ణ చైతన్య, ఏఈఓలు సుజిత, రంజిత, ఆర్.ఎస్ కె సిబ్బంది అనుప, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు