Thursday, December 12, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅవయవ దానం అరుదైన అవకాశం.. యువర్స్ ఫౌండేషన్

అవయవ దానం అరుదైన అవకాశం.. యువర్స్ ఫౌండేషన్

అవయవ దానం అరుదైన అవకాశం.. యువర్స్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం:: అవయవ దానం అరుదైన అవకాశం అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర, పి.ఆర్.ఓ రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానం నేడు మహాదానం అవుతుందని, నేత్ర ధానముతో ఇరువురికి కంటి వెలుగును ప్రసాదించవచ్చునని తెలిపారు. కళ్లదానం చేయాలి అనుకుంటే మరణానంతరం మాత్రమే నేత్రాలను దానం చేసే అవకాశం ఉందని తెలిపారు. మరణించిన నాలుగు నుంచి ఆరు గంటల లోపు కళ్ళను దానం చేయవచ్చునని తెలిపారు. వయసు లింగభేదం లేకుండా ఎవరైనా కూడా నేత్రదానం చేయవచ్చునని, ఆ నేత్రదానం అనేది అంతక్రియల లాంచనాలకు ఆలస్యం చేయదని తెలిపారు. నేత్ర ధానమును కేవలం 10 లేదా 15 నిమిషాలలో మాత్రమే సమయం పడుతుందని తెలిపారు. ఒక కంటి దాత ఇద్దరు కార్నియల్ అందవ్యక్తులకు దృష్టిని అందించగలుగుతారని తెలిపారు. అందమైన కళ్ళను మట్టిలో కలపడం అగ్నికి ఆహుతి చేసి బూడిదగా మార్చడం కంటే ప్రపంచమే చీకటిగా బ్రతుకుతున్న చూపులేని వారి కోసం, మీ కళ్ళను దానం చేసి మానవతా విలువను పెంచుకోవాలని తెలిపారు. కళ్లను దానం చేసి, చీకట్లకి వెలుగును నింపే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగినప్పుడే చూపు లేని వారికి కంటి వెలుగును ప్రసాదించే అవకాశం ఎంతైనా ఉందని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు