Thursday, May 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా లక్ష్యం..

పేద ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా లక్ష్యం..

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే మా లక్ష్యము, మా ప్రాధాన్యత అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బివి రమణ, కోశాధికారి, శిబిర నిర్వాహకులు, చైర్మన్ దాసరి వెంకటేశులు, (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 111వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో డాక్టర్.వివేక్ కుళ్ళయప్ప – దంత వైద్యులు, డాక్టర్. డివి. జైదీపు నేత- గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్- హైదరాబాద్, డాక్టర్. ఎస్. విటల్-దంత వైద్యులు, డాక్టర్.సాయి శ్వేత -జనరల్ మెడిసిన్ లచే రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల ఉండాల్సిన నియమ నిబంధనను గూర్చి వివరించడం జరిగిందన్నారు. బీపీతోపాటు షుగర్ పరీక్షలు కూడా నిర్వహించాము అని తెలిపారు. ఈ శిబిరంలో 275 మంది రోగులకు వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడు మందులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు చింతా లక్ష్మీనరసమ్మ, కీర్తిశేషులు చింత రామకృష్ణ ల జ్ఞాపకార్థం వీరి కుమారులు చింతా వెంకట రంగయ్య, చింత కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు నిర్వహించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలను ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ తెలియజేశారు. వృద్ధులు, వికలాంగులు, అన్ని వయసుల వారికి ఈ శిబిరంలో ఆరోగ్యం పై తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రతినెలా ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నెలకు 200 రూపాయలు ప్రకారం పెన్షన్ను అర్హత గలవారికి అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాచర్ల నారాయణస్వామి, బంధనాథం చిన్నికృష్ణ ,సిరివెళ్ల రాధాకృష్ణ, బండి నాగరాజు, మేకల శివయ్య ,మామిళ్ళ అశ్వర్థ నారాయణ, పవన్ కుమార్ , రెడ్డి సాయి, పెద్దకోట్ల భాస్కర, పెద్దకోట్ల విజయ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు