రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు భోజనం పంపిణీ చేయడం దైవ సేవగా భావిస్తున్నామని రజనీ ట్రస్ట్, రక్షాబంధన్ ట్రస్ట్ కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలుచోట్ల 80 మంది పేద ప్రజలకు, అనాధలకు, ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 57 రోజులుగా ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సేవాదాతగా శ్రీలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మానవసేవయే మాధవసేవ అన్న స్ఫూర్తితో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే సెల్ నెంబర్ 9731135903 కు గాని 9391553146 కు గాని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కేతాలోకేష్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు భోజనం పంపిణీ చేయడం దైవ సేవగా భావిస్తున్నాం..
- Advertisement -
RELATED ARTICLES


