యువర్స్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు.. షీలా నాగేంద్ర, ఆర్. జయరాం
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయము అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర కార్యదర్శి ఆర్ జయరాం కోశాధికారి వంకదారి మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ.. శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి-బెంగళూరు వారి సహాయ సహకారములతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 75 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో వైద్యులు వైద్య చికిత్సలను అందించగా 46 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరికి ఉచిత కంటి ఆపరేషన్ తో పాటు ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ధర్మవరము పరిసర ప్రాంతాల ప్రజలకు కొన్ని వేల మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించి కంటి చూపును ప్రసాదించడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ శిబిరంలో కంటి శుక్లముల ఉన్న వారిని పరీక్షించి ఆపరేషన్కు అర్హులైన వారిని అదే రోజున ధర్మవరం నుండి బెంగళూరుకు ప్రత్యేక బస్సులో తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. బిపి, షుగర్ ఉన్న రోగులకు రిపోర్టులో తగ్గిన తర్వాత ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ షేక్ సికిందర్, సుకుమార్, కేతాలోకేష్, పోలా ప్రభాకర్, సీకే రామాంజనేయులు, చాంద్ బాషా, నేత్ర జ్యోతి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..
- Advertisement -
RELATED ARTICLES


