Sunday, February 23, 2025
Homeఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న పసిడి ధరలు..

ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న పసిడి ధరలు..

దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే గరిష్టాల వద్దకు చేరిన బంగారం ధరలు సోమవారం ట్రేడింగ్‌లో మరింత పైకి ఎగబాకాయి. పది గ్రాముల బంగారం ధర 87 వేలను దాటేసి రికార్డు సృష్టించింది. పది గ్రాముల బంగారం ధర 87 వేల రూపాయలను దాటడం ఇదే ప్రథమం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.79, 800కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.390 పెరిగి 87, 060కు చేరింది. నిజానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.80 వేలు దాటిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే రూ.87 వేలకు కూడా చేరుకుంది. భవిష్యత్తులో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు కూడా చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 10న) దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ. 87, 060, రూ. 79, 800

విజయవాడలో రూ. 87, 060, రూ. 79, 800

ఢిల్లీలో రూ. 87, 210, రూ. 79, 950

ముంబైలో రూ. 87, 060, రూ. 79, 800

వడోదరలో రూ. 87, 110, రూ. 79, 850

కోల్‌కతాలో రూ. 87, 060, రూ. 79, 800

చెన్నైలో రూ. 87, 060, రూ. 79, 800

బెంగళూరులో రూ. 87, 060, రూ. 79, 800

కేరళలో రూ. 87, 060, రూ. 79, 800

పుణెలో రూ. 87, 060, రూ. 79, 800

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు