ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌ను సహించలేని దాయాది పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతిచెందిన జవాన్‌ను మురళీ నాయక్‌గా గుర్తించారు. వీర జవాన్‌ది ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని కల్లి తండా. గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరపగా మన సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ చనిపోయినట్లు సమాచారం. శనివారం స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు తెలుస్తోంది.కాగా, వీర జవాన్ మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువుతండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌లో చదివాడు. జవాన్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్వగ్రామం కల్లితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. తెలుగు జవాన్ వీర మరణం
RELATED ARTICLES