విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.ఓ), నవ యువ సమాఖ్య (ఎన్ వై ఎస్) విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12 న గుంటూరులోని అరండల్ పేట లో అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలసీనాపై సాగిస్తున్న దుర్మార్గ యుద్ధాన్ని ఖండిస్తూ పాలస్తీనా సంఘీభావ సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. పాలస్తీనా సంఘీభావ సభ పోస్టర్ ను మంగళవారం గోవాడ ఎస్టి కాలేజీ బాయ్స్ హాస్టల్ వద్ద అలాగే చోడవరం ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్ వద్ద ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. గల్ఫ్ దేశాలలో ఉన్న చమురు ఆయిల్ నిక్షేపాలను దోచుకోవడం లో భాగంగా పాలస్తీనాపై ఇజ్రాయిల్ ను యుద్ధం చేయటానికి కావలసిన ఆయుధ పరికరాలను, డబ్బును, సైనికుల్ని కూడా అమెరికా సప్లై చేస్తూ ఇజ్రాయిల్ ను తన అవసరాలకు అనుగుణంగా వాడుకుంటుందన్నారు. ఈ యుద్ధాన్ని ఆపాలని అనేక దేశాలు ప్రతిపాదించినను, ఖాతరు చేయడం లేదని, 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఇజ్రాయిల్ తోసిపుచ్చిందని తెలియజేశారు. మొత్తం ప్రపంచ యుద్ధ నియమాలను కూడా పాటించకుండా పాఠశాలలు, హాస్పిటల్స్ పైన, ప్రజా సామాన్యం ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోందన్నారు. ఈ దాడులలో 50,000 మందికి పైగా మరణించగా అందులో 20,000 మంది పసిపిల్లలు, ఆడవాళ్లు ఉన్నారన్నారు. దుర్మార్గంగా సాగిస్తున్న ఈ యుద్ధాన్ని ఆపాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, యుద్దోన్మాదం నశించాలని, ప్రపంచ శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. భాస్కర్ అధ్యక్షత వహించగా … కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బి. జమిందార్,
కొత్తపల్లి రవిబాబు, ప్రధాన సంపాదకులు, ప్రజాసాహితి షేక్. జిలాని, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు డాక్టర్ సి. విజయ, రాష్ట్ర అధ్యక్షులు స్త్రీ విముక్తి ఎస్.కె.భాష, ఎన్.వై.ఎస్ ప్రధాన కార్యదర్శి
ఏ.సురేష్, పి.డి.ఎస్.ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.భాను తదితరులు మాట్లాడుతారన్నారు. ఈ యొక్క సమావేశానికి విద్యార్థులు, యువకులు, మేధావులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ మండల నాయకులు ఏ. అఖిల్, పి.రామకృష్ణ, గణేష్, శివ, ఎన్. వై. ఎస్ నాయకులు టి. అర్జున్ , వై రాజు తదితరులు పాల్గొన్నారు.