విశాలాంధ్ర ధర్మవరం;; నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని కోరుతూ ఈనెల 20వ తారీకున జరగబోయే దేశవ్యాప్త సమ్మయొక్క కరపత్రాలను సిఐటియు నాయకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జె వి రమణ, ఎస్ హెచ్ బాషా,టీ. అయుబ్ ఖాన్,మాట్లాడుతూ ఈనెల 20 తారీకున కార్మిక హక్కులను కాపాడడం కోసం ,నాలుగు కార్మిక కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మిక విధానాన్ని రద్దుచేసి కార్మికులందరికీ రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రవేటికరణ ఆపాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని తదితర ప్రధానమైన డిమాండ్ల సాధనకై
ఈనెల 20వ తారీఖున జరగబోయే సమ్మె జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎల్. ఆదినారాయణ, బొగ్గు నాగరాజు, అనిల్, రాము, నాగవేణి జయమ్మ, పోతలయ్య, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
20న జరగబోయే దేశవ్యాప్తసమ్మె కరపత్రాలు విడుదల : సిఐటియు
RELATED ARTICLES