Saturday, March 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆరు నెలల మా జీతాలు చెల్లించండి.. క్లాప్ ఆటో డ్రైవర్ల ఆవేదన

ఆరు నెలల మా జీతాలు చెల్లించండి.. క్లాప్ ఆటో డ్రైవర్ల ఆవేదన

విశాలాంధ్ర- ధర్మవరం ; గత కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం పట్టణంలోని అపరిశుభ్రతను క్లాప్ఆటో ద్వారా 15 మంది డ్రైవర్లు, ఇతరులు కలిసి శుభ్రపరిచేవారు. కానీ కొన్ని సంవత్సరాలు సాఫీగా జరిగిన, తదుపరి 9 నెలలుగా మాకు జీతాలు అందలేదని క్లాస్ ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 25 క్లాప్ ఆటోలు ఉన్నాయని, అప్పట్లో మా పనిని ఎంతో శ్రద్ధగా పనిచేయడం జరిగిందని, కానీ మా కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోయారని తెలిపారు. మొత్తం 15 మంది క్లాప్ ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి నెలకు 12 వేల రూపాయలు చొప్పున 9 నెలలకు ఒక్కొక్కరికి ఒక లక్ష 8 వేల రూపాయలు చొప్పున రావలసి ఉందని తెలిపారు. మాకు పూట గడవడమే కష్టమని, ఇంతవరకు జీతాలు ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోయిందో మాకు అర్థం కాలేదని బాధను వ్యక్తం చేశారు. కానీ విజయవాడలో క్లాప్ ఆటో రెడ్డి ఏజెన్సీ వారు కు పలుమార్లు మున్సిపల్ అధికారుల ద్వారా తెలిపిన కూడా ఎటువంటి స్పందన రాలేకపోవడం ఎంతో బాధను గురిచేస్తోందని తెలిపారు. మా గోడును మున్సిపల్ అధికారులకు, ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ కు, నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు కూడా పలుమార్లు మా గోడును తెలుపుకుంటూ వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కానీ నెలలు గడిచిన మా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ప్రస్తుతం మా కుటుంబం అప్పుల్లో కూరుకుపోయిందని, కనీసం ఇప్పుడైనా అధికారులు స్పందించి మాకు రావలసిన జీతాలను వెనివెంటనే ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు