విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని రాజవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ వాడపల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మండలంలో రాజవరం గ్రామంలో టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధ గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 102 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కే రాజేశ్వర రావు, గర్సి కూటి శ్రీను, ఏడుకొండలు, మనోజ్ ,గంగాధర్, పతి రాజు, వెంకటేష్, కృష్ణంరాజు పాల్గొన్నారు.