విశాలాంధ్ర – నెల్లిమర్ల : సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్ ఐ రామ గణేష్ అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సంకల్పం ప్రచార రథం తో బుదవారం సతివాడ మోడల్ హైస్కూల్లో పిల్లలకు గంజాయి వలన కలిగే దుష్ప్రయోజనాలు, గంజాయి నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలు, నేటి యువతపై గంజాయి డ్రగ్స్ ప్రభావం, ఈ డ్రగ్స్ కుటుంబాలును ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తాయి, సైబర్ నేరాలు హనీ ట్రాప్ ,ట్రాఫిక్ అవేర్నెస్ తదితర అంశాలు గురించి అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తో పాటుగా మిగతా ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.