Sunday, February 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన పూర్తి దశలో కల్పించాలి..

మలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన పూర్తి దశలో కల్పించాలి..

జిల్లా మలేరియా అధికారి ఓబులు
విశాలాంధ్ర ధర్మవరం;; మలేరియా వ్యాధి పట్టా ప్రజలకు అవగాహన పూర్తి దశలో కల్పించాలని జిల్లా మలేరియా అధికారి ఓబులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి సిబ్బంది యొక్క హాజరు పట్టికను తనిఖీ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ నిర్వహించే అన్ని రిజిస్టర్లు రికార్డులను తనిఖీ చేశారు. యాక్టివ్ సర్వే లైన్స్ పాసివ్ సర్వే లైన్స్ లో రక్తపూతలు వస్తున్నాయా? అలాగే అందులో ఏమైనా మలేరియా పాజిటివ్స్ ఉన్నాయేమో? ల్యాబ్ టెక్నీషియన్ రమేష్ ను అడగడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ జయరాం నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు