రిటైర్డ్ జిల్లా ఆందత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర -ధర్మవరం! నీటి కాసుల వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ కంటిని కాపాడుకోవాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ నీటి కాసుల వ్యాధి (గ్లోకోమా) నివారణ వారోత్సవాలు ఈనెల 9 నుండి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ వ్యాధి గురించి ప్రజలకు తప్పక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని అలాగే అంధత్వాన్ని నివారించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ నీటి కాసుల వ్యాధిని గ్లోకోమా, నీటి శుక్లాలు అని కూడా అంటారని తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే శరీరానికి బీపీ ఎలాగో కంటికి కూడా బీపీ వంటిది అని తెలిపారు. పుట్టిన బిడ్డ నుండి కూడా ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. అదే పెద్దలకైతే 50 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ప్రారంభమవుతుందని తెలిపారు. వంశపార్యం పరం మధుమేహం హస్వ దిష్టి, స్థిరాయేడ్ మందులు వాడేవారు కు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నీతికాసుల వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయని ఒక రకం వ్యాధిలో కన్ను ఎర్రబడి నొప్పి చేస్తూ ఉంటే కంటి డాక్టర్ను సంప్రదించాలన్నారు. ఈ వ్యాధి నిర్ధారణలో కంటి ఒత్తిడి పరీక్ష కంటిలోని ద్రవం యొక్క ప్రవాహంలో అడ్డంకులను గుర్తించుట దృష్టి వైశాల్యమును పరీక్షించుట కంటి నరమును పరీక్షించుట తదితరములు నీటి కాసుల వ్యాధి నిర్ధారింపబడుతుందని తెలిపారు. కంటి కాసుల వ్యాధి వలన కలిగే అంతత్వాన్ని మాత్రం నివారించవచ్చునని, అందుకే వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు.
నీటి కాసుల వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
RELATED ARTICLES