విశాలాంధ్ర – నెల్లిమర్ల : రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం జరుగుతుందని
మండల నోడల్ అదికారి, గృహ నిర్మాణ శాఖ జిల్లా పి.డి పి. కూర్మినాయుడు అన్నారు. మండలం లోని బొప్పడాం గ్రామంలో మంగళవారం సబ్ రిజిస్ట్రార్, దేవాదాయశాఖ, అటవీ శాఖలతో కలిసి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. నోడల్ అధికారి కూర్మినాయుడు మాట్లాడుతూ మీ భూమి- మీ హక్కు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని . ప్రజలు భూ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేడు గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 45 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులకు ప్రజలు అర్జీ రూపంలో తమ సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఇకనుంచి భూ సమస్యలపై భాదితులు కార్యాలయాల చుట్టూ తిరగడం కాకుండా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఉద్దేశంతో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ , మ్యుటేషన్, 22ఎ,డీకేటి, రీ సర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు.
బాధితులు తమ సమస్యలు అర్జీ రూపంలో తెలియజేసి రసీదు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ అంబళ్ళ కిరణ్ కుమార్, ఎంపిటిసి బొంతు పురుషోత్తంనాయుడు , తహసీల్దార్ బి.సుదర్శనరావు, పంచాయితీ కార్యదర్శి పుష్పలత, ఆర్ ఐ వేణు గోపాల్ రావు, విఆర్ ఓ బి గోవిందారామ్, మండల సర్వేయర్ టి దివ్య మానస, గ్రామ పెద్దలు. బొంతు వెంకటరమణ ,అంబల్ల సత్యనారాయణ, అంబల్ల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.