విశాలాంధ్ర నందిగామ:-నందిగామ ఎంపీపీ గా మండల పరిధిలోని కమ్మవారిపాలెం ఎంపీటీసీ మెంబర్ పెసరమల్లి రమాదేవి ని ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా గురువారం ఎన్నుకున్నారు నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెసరమల్లి రమాదేవి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలి(ఎంపీపీ)గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని అధికారిని శ్రీలక్ష్మి తెలిపారు ఈ ఓటింగ్ ప్రక్రియకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మండల ప్రజలు ఏకగ్రీవంగా నూటికి 90% పైగా తమకు మద్దతు తెలిపారని దాని ద్వారా అప్పుడు రెండు ఎంపీటీసీ స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలు వైయస్సార్సీపి గెలుచుకుందని తెలిపారు నందిగామ మండల పరిషత్ అధ్యక్షురాలిగా కేతవీరునిపాడు ఎంపిటిసి అరిగెల సుందరమ్మను గతంలో ఇదే సభ్యులు ఎన్నుకోగా ఇటీవల కూటమి ప్రభుత్వం రాకమునుపే తను తన వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేయటం ఇన్చార్జి ఎంపీపీ గా అడవిరాములపాడు ఎంపిటిసి మెంబర్ ఆకుల హనుమంతరావు(రంగా) బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఈ తరుణంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఎంపీపీ ఎన్నికల ను నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది దీంతో గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో మరల తిరిగి వైసిపి తమ సత్తా చాటుకుంది కేవలం రెండు స్థానాలకే పరిమితమైన అధికార పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడం తో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీలో ఉన్న పెసరమల్లి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ మండల పరిషత్ అధ్యక్షురాలిగా రమాదేవి ఎంపిక రావడం సంతోషదాయకంగా ఉందన్నారు అధికార కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రలోభాలకు గురిచేసిన ఎంపీటీసీ మెంబర్లు అందరూ అంకుటిత దీక్షతో వైఎస్ఆర్సిపి వెంబడి నిలబడినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆయన అభినందనలు తెలిపారు ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను గుంజుకున్నట్లుగా నేడు కూడా మరో ప్రయత్నం చేసి అధికార కూటమి బొక్క బోర్ల పడ్డదని ఎద్దేవా చేశారు ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సిపి కి చెందిన ఎంపీటీసీ పెసరమల్లి రమాదేవి నందిగామ మండల పరిషత్ అధ్యక్షురాలు గా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు కు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కు,తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీ మెంబర్లకు పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు..
నందిగామ ఎంపీపీ గా పెసరమల్లి రమాదేవి ఏకగ్రీవం…
RELATED ARTICLES