మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పందులు పట్టణాలలో తిరగరాదని, పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పందుల పెంపకం జరగాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పురపాలక సంఘ కార్యాలయంలో బందుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో బందుల సంచారంపై ప్రజల నుండి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, పందుల వలన పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పందులను వారము లోపల పట్టణానికి దూరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో పందులు పెంపకం దారులు పెంచుకోవాలని తెలిపారు. లేనియెడల కఠిన చర్యలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించడం జరిగింది. బడన్నపల్లి దగ్గర పందుల పెంపకం కు సరైన స్థలము ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ పందుల పెంపకం దారులు తమ పందులను పెంచుకోవాలని, అందుకు నెలవారి బాడిగ కూడా ఇవ్వాలని తెలిపారు. కమిషనర్ ఆదేశాలను దేఖాతలు చేస్తే, కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పందుల యజమానులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు శాంసన్, కేశవ, మేస్త్రీలు ఆదినారాయణ, నరసింహులు, పార్థసారథి, సచివాలయ శానిటరీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పందుల పెంపకం ఉండాలి
RELATED ARTICLES