Homeజాతీయంత్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. రూ.10, రూ.20 నోట్లపై పైలట్ ప్రాజెక్ట్

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. రూ.10, రూ.20 నోట్లపై పైలట్ ప్రాజెక్ట్

- Advertisement -

భారత కరెన్సీ స్వరూపాన్ని మార్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ముందడుగు వేసింది. దేశంలో మరింత మన్నికైన, సురక్షితమైన పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా, తక్కువ విలువ కలిగిన నోట్ల కోసం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన ప్రత్యేక ముడిపదార్థం సరఫరా కోసం ఆర్బీఐ అనుబంధ సంస్థ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఆర్బీఐ కరెన్సీ ముద్రణ విభాగమైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్ఎంపీఎల్‌), ఈ గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ)ను నేడు జారీ చేసింది. అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉండే ఒపాసిఫైడ్ బైయాక్సియల్లీ ఓరియెంటెడ్ పాలీప్రొఫైలిన్ (బీఓపీపీ) పాలిమర్ షీట్ల కోసం ఈ టెండర్ పిలిచారు. రెండు వేర్వేరు డినామినేషన్ల కోసం మొత్తం 68,000 రీముల (ఒక్కోదానికి 34,000 రీములు) మెటీరియల్ అవసరమని పేర్కొన్నారు. బిడ్లు దాఖలు చేయడానికి ఆగస్టు 18ని చివరి తేదీగా నిర్ణయించారు.

తొలుత రూ.10, రూ.20 నోట్లతో ప్రయోగం
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట రూ.10, రూ.20 నోట్లను పరీక్షించే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ నోట్ల చలామణి ఎక్కువగా ఉండటం, ఇవి త్వరగా పాడైపోతుండటంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఫీల్డ్ ట్రయల్స్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి విజయవంతమైతే 2027 నుంచి దశలవారీగా ప్లాస్టిక్ నోట్లను విస్తృతంగా చలామణిలోకి తీసుకురావొచ్చని భావిస్తున్నారు. అయితే, దీనిపై ఆర్బీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదన ప్రాథమిక పరిశీలనలో ఉందని, వాటి లాభనష్టాలను అంచనా వేస్తున్నామని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు