Tuesday, May 6, 2025
Homeజాతీయంభద్రతపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష.. అజిత్ దోవల్‌తో భేటీ

భద్రతపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష.. అజిత్ దోవల్‌తో భేటీ

పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, దేశ భద్రతాంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో నేడు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కేవలం 48 గంటల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ చర్చలు దేశ భద్రతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ కఠిన చర్యలు తీసుకుంటుందన్న సంకేతాల మధ్య ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర హోంశాఖ కూడా చురుగ్గా వ్యవహరిస్తోంది. బుధవారం (మే 7న) దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పౌరుల స్వీయరక్షణ, అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించడమే ఈ మాక్‌డ్రిల్స్ ప్రధాన ఉద్దేశమని హోంశాఖ వర్గాలు తెలిపాయి. అధికారులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌సీసీ/ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు, నెహ్రూ యువ కేంద్రాల ప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను ఈ డ్రిల్స్‌లో భాగస్వాములను చేయనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు