Saturday, February 22, 2025
Homeజిల్లాలుకర్నూలుకవి సోమన్న "హృదయ రాగాలు" పుస్తకావిష్కరణ

కవి సోమన్న “హృదయ రాగాలు” పుస్తకావిష్కరణ

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మండల పరిధిలోని కంబదహాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న 63వ పుస్తకం “హృదయ రాగాలు” అవనిగడ్డ శాసన సభ్యులు డా.మండలి బుద్ధ ప్రసాద్, ఉపకులపతి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఆచార్య వెలదండ నిత్యానంద రావు,ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి , జింక సుబ్రహ్మణ్యం,ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు శివకృష్ణ మరియు విచ్చేసిన అతిరథ మహారథుల చేతుల మీదుగా శనివారం ఐ.ఎం. ఎ హాల్, శంకరాపురం,కడపలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం పుస్తకాన్ని శ్రీ యల్లాప్రగడ నరసింహ సాయికి అంకితమిచ్చారు. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న,రమారమి 6 వసంతాల కాల వ్యవధిలో 64 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని గుర్తించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ డి. కె.చదువులబాబు, కవి,కళాకారుడు శ్రీ కె.వి.నాగేశ్వరయ్య, కొప్పుల ప్రసాద్,జహీర్ తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు