- Advertisement -
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకుంటున్న గొలుసు దొంగతనాల (చైన్ స్నాచింగ్) ఘటనలపై జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. మహిళల రక్షణే ధ్యేయంగా జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలను, నిఘాను తీవ్రతరం చేశారు. ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా దుండగులు స్నాచింగులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


