Homeసినిమాధురంధర్ 2 పై టాలీవుడ్ హీరోలు ప్రశంసించడంపై ప్రకాశ్‌ రాజ్ సెటైర్

ధురంధర్ 2 పై టాలీవుడ్ హీరోలు ప్రశంసించడంపై ప్రకాశ్‌ రాజ్ సెటైర్

- Advertisement -

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ధురంధర్ ది రివెంజ్ ను దక్షిణాది స్టార్ హీరోలు ప్రశంసించడంపై ఆయన పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రశంసల వెనుక ఉన్నది నిజమైన అభిమానమేనా, లేక ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయా? అనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు.

వివరాల్లోకి వెళితే… రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన విష‌యం తెలిసిందే. సినిమాకు మంచి స్పందన వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్, మహేశ్‌ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వంటి పలువురు దక్షిణాది అగ్ర తారలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.

ఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్..నలుగురు పెద్ద సౌత్ స్టార్లు ఃధురంధర్ఃను పొగిడారు. ఒక్క బాలీవుడ్ సెలబ్రిటీ అయినా ఈ సినిమా గురించి మాట్లాడారా? అని ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. ఈ బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా పాకుతున్నాయి.. #జస్ట్ఆస్కింగ్ అని కామెంట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు