మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం:: గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ నాయక్, మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, కార్యదర్శి మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మీ చెన్నకేశవపురంలో గల అర్బన్ హెల్త్ సెంటర్ లోని 45 మంది గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలని, మందులు సక్రమంగా వేసుకోవాలని, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. నెలవారి పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకోవాలని, ప్రసవాన్ని ప్రభుత్వాసుపత్రిలోనే చేయించుకోవాలని తెలిపారు. అప్పుడే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతగా మానవతా సంస్థ డైరెక్టర్ ఆంజనేయ చౌదరి తన తండ్రి కీర్తిశేషులు గోనుగుంట్ల వెంకటరాముడు జ్ఞాపకార్థం వ్యవహరించడం జరిగిందని తెలిపారు. తదుపరి మానవతా స్వచ్ఛంద సంస్థతోపాటు డాక్టర్ సురేష్ నాయక్ ఆసుపత్రి సిబ్బంది వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. కుటుంబంలో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు తప్పకుండా కుటుంబంలోని సభ్యులందరూ కూడా తమ సహాయ సహకారాలను అందిస్తూ, చేదోడువాదోడుగా ఉన్నప్పుడే గర్భిణీ స్త్రీలు సంతోషంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, కోశాధికారి చంద్రశేఖర్, సభ్యులు రామకృష్ణ, జగ్గా నాగరాజు, జింక చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి
RELATED ARTICLES