Saturday, November 30, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి

ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి

రూరల్ ఎస్సై -శ్రీనివాసులు

విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని ఓబుల నాయన పల్లి గ్రామానికి చెందిన బొమ్మక గారి పోతులయ్య (72) ప్రమాదవశాత్తు మృతి చెందాడని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు గత ఐదు సంవత్సరాల నుండి వయసు మీద పడటంతో కళ్ళు కూడా సరిగా కనపడకపోవడంతో మంచం మీదనే ఉంటున్నాడని తెలిపారు. మృతుని కుమారుడే స్వయంగా సఫరి చర్యలు చేస్తూ ఉండేవాడు. మృతుడు కాల కృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు. ఈనెల 29వ తేదీ అర్ధరాత్రి సమయంలో మృతుడు పోతులయ్య తనకున్న అలవాటు ప్రకారం బీడీ తాగుతూ, అగ్గిపుల్లను ఆర్పకుండా పక్కకు వేయడంతో, అది ప్రమాదవశాత్తు తాను పడుకున్న పరుపుకు అంటుకోవడం జరిగింది. అలాగే తను ఉండే కొట్టమంతా అగ్నికి ఆహుతి కావడం జరిగిందని తెలిపారు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు