Thursday, December 12, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల ఆణిముత్యాలు.. ప్రిన్సిపాల్ అనూప్

క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల ఆణిముత్యాలు.. ప్రిన్సిపాల్ అనూప్

విశాలాంధ్ర ధర్మవరం:: క్రీడా పోటీలలో పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఆణిముత్యాలుగా ప్రతిభ కనపరచడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్ ,ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 25, 26 వ తేదీలలో విశాఖపట్నంలో జరిగిన త్రోబాల్ అండర్- 19 విభాగములో ఎస్ జి ఎఫ్ ఐ గవర్నమెంట్ లో జరిగిన పోటీలలో మా పాఠశాల విద్యార్థులు అనంతపురం జట్టుకు ప్రాతినిధ్యం వహించి, ప్రతిబ గణపరిచి, బాలికలు మొదటి స్థానంలో, బాలురు మూడవ స్థానంను కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. త్రో బాల్ పోటీలలో మా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆర్. కార్తీక్ నాయక్, వినీత్ రెడ్డి, అశ్విన్, వెంకటేశులు, ఎన్.ధాత్రి రెడ్డి, సాయి శ్వేత, అదేవిధంగా 8వ తరగతి చదువుతున్న తన్మయి కలరని తెలిపారు. అనంతరం డైరెక్టర్ తోపాటు ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు