Sunday, December 1, 2024
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాఅన్ని రంగాల్లో మహిళలు రాణించాలి… ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి… ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ :- అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని,మహిళలు ఆర్థిక శక్తిగా ఎదకాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలుత చేసిన ఐదు సంతకాల్లో స్కిల్ సెన్సస్ ఫైల్ కూడా ఉందని అన్నారు,విజనరీ ఉన్న నేత చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంస్కరణలు,యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేపడుతున్నారని అన్నారు,అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు దూసుకెళ్తున్నారన్నారు. మహిళలు వారి స్వశక్తితో నిలదొక్కుకొని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించిన నాడే నిజమైన మహిళా సాధికారత అన్నారు,కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపేట వేస్తున్నట్లు చంద్రబాబు అపార అనుభవం, ముందుచూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం అని తెలిపారు. హైదరాబాదును ఒక మహానగరంగా తీర్చిదిద్ది ప్రపంచం ఏపీ వైపు చూసేలా అభివృద్ధికి బాటలు వేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడు సామాజిక ప్రగతి సాధ్యం అన్నారు.స్కిల్ సెన్సస్ నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని అన్నారు.యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్‌లోనూ ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ ను ఆమె అందజేశారు ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు,అధికారులు,మహిళా పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యం మరియు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు